Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రయాణికురాలికి రైడర్ అనుచిత సందేశాలు.. క్షమాపణలు చెప్పిన ర్యాపిడో

Ghaziabad woman shares Rapido driver inappropriate messages company reacts
Advertisement
  • ఘజియాబాద్‌లో మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం
  • స్క్రీన్ షాట్లను ఆధారాలుగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ప్రయాణికురాలు
  • ఫోన్ నెంబర్, రైడ్ ఐడీ ద్వారా రైడర్‌ను గుర్తించి చర్యలు తీసుకుంటామన్న ర్యాపిడో
Advertisement
ఘజియాబాద్‌లో ఒక మహిళ, ట్రిప్ పూర్తి చేసిన తర్వాత ర్యాపిడో బైక్ టాక్సీ రైడర్ తనకు అనుచితమైన సందేశాలు పంపాడని ఆరోపించిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ర్యాపిడో, ఆ మహిళకు క్షమాపణలు చెప్పింది. ఇందుకు సంబంధించి మహిళ స్క్రీన్ షాట్లను ఆధారాలుగా తన సామాజిక మాధ్యమ వేదికగా పోస్టు చేసింది. "ర్యాపిడో బుక్ చేసుకుంటే.. ఇలా జరిగింది" అంటూ ఆమె పేర్కొంది.

ఘజియాబాద్‌‍లో ఒక మహిళ ర్యాపిడోను బుక్ చేసుకుంది. గమ్యం చేరిన తర్వాత సదరు ర్యాపిడో డ్రైవర్ కస్టమర్ ఇచ్చిన ఫోన్ నెంబర్‌తో వాట్సాప్‌లో కాంటాక్ట్ అయ్యాడు. అజ్ఞాత వ్యక్తిగా చాట్ చేయడం ప్రారంభించాడు.

"మీరు చూడటానికి అందంగా ఉన్నారు. మీ వయస్సెంత" అంటూ చాట్ చేయడం ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీనితో ర్యాపిడో సంస్థ స్పందించింది. ఆ డ్రైవర్ అనుచిత ప్రవర్తనపై క్షమాపణలు కోరింది. రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్, రైడ్ ఐడీ ద్వారా అతడిని గుర్తించి, చర్యలు తీసుకుంటామని తెలిపింది.
Advertisement
Advertisement
Rapido driver inappropriate messages
Rapido reacts

More Telugu News